కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి సూసైడ్ కేసులో ఫోరెన్సిక్ నివేదిక సంచలనం రేపుతోంది. ప్రీతి బాడీలో ఎలాంటి టాక్సిన్స్ (విషవాయువులు) లేవంటూ ఫోరెన్సిక్ బృందం తన రిపోర్టులో పేర్కొంది. అయితే.. దీంతో ప్రీతి ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంటూ పోలీసులు చెబుతూ వచ్చిందంతా అబద్ధమని ఫొరెన్సిక్ రిపోర్టుతో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో.. ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య అంటూ వాదిస్తూ వస్తున్నవారి మాటే నిజమైందనే విషయం తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన తాజా నివేదికతో ప్రీతిది హత్యేననే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నట్లు సమాచారం. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ వెల్లడించింది.
Also Read : NTR: ఆస్కార్స్… ఎన్టీఆర్ వస్తున్నాడు…
ఇదిలా ఉంటే.. మెడికో ప్రీతిది హత్యేనని బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన బండి సంజయ్.. ప్రీతి కేసులో ఆధారాలను తారుమారు చేశారని విమర్శించారు. డెడ్‌బాడీలు మాయం చేసే చిల్లర సంస్కృతి ఈ ప్రభుత్వానిదేనన్నారు. ప్రీతి మృతి కేసుపై సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read : Exxeella Education Group: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి అనూహ్య స్పందన