సురవరం సుధాకర్‌రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరా విషయాన్ని కేంద్రం నుంచి వెంటనే తేవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.
CM Revanth Reddy: తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇక ఈ ట్వీట్ లో భాగంగా.. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు.. యూరియా సరఫరా చేయకుండా.. నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన…
RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
Bandi Sanjay: మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు.
KTR Sends Legal Notice to Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ఫోన్ టాపింగ్ కేసులో బండి సంజయ్ అడ్డగోలుగా, అసత్యపూరితంగా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజా ప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం అంటూ నోటీసులలో పేర్కొన్నారు. Also…
Bandi Sanjay Slams Telangana Govt for House Arrest of Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును రాష్ట్ర ప్రభుత్వం హౌజ్ అరెస్ట్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంటి? అని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని మండిపడ్డారు. భాగ్యనగరంలో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్…
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపధ్యంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ బండి సంజయ్, “ట్విట్టర్ టిల్లు.. నువ్వు చేసిన అక్రమాలను మర్చిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు” అంటూ వ్యాఖ్యానించారు. లీగల్ నోటీసుల వెనక దాక్కుంటూ…
KTR : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తెలంగాణలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బండి సంజయ్‌కు లీగల్ నోటీసు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఫోన్ ట్యాపింగ్ విషయంలో…
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ బూటకపు విచారణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోణాన్ని తప్పుగా మలుపు తిప్పుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నప్పటికీ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యాంశం.. మాజీ సీఎం…