తెలంగాణ రాష్ట్రానికి ఎల్లుండి (జూన్ 19న) కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాబోతున్నారు. ఇక, కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది.
హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ సిబ్బంది నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. రాయ్ , బండి సంజయ్ కూడా కౌగిలించుకున్నారు. ఈ కార్యక్రమానికి హంపి మఠం శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ,…
Telangana Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తాలు ఖరారయ్యాయి.
కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 71 మంది మంత్రులతో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రులతో ప్రమాణం చేయించారు. మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను అప్పగించిన కేంద్రం.. బండి సంజయ్‌కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టింది. వీరితో పాటు.. మోడీ 3.0లో అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను, రాజ్‌నాథ్…
CM Revanth Reddy: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈరోజు చాలా ఆనందంగా ఉందని.. తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను ఈస్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో…