Bandi Sanjay: తెలంగాణ లో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. స్మార్ట్ సిటీ పనుల గడువు పెరగడం వల్ల కరీంనగర్ కి మరిన్ని నిధులు వస్తాయన్నారు. రేవంత్ ఒక్కడే అడిగితే స్మార్ట్ సిటీల అభివృద్ధి గడువు పొడిగించలేదు… వివిధ రాష్ట్రాల సీఎంలు అడిగారని కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ ,కొండగట్టు,…
కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పాంచ్ న్యాయ పేరుతో చెప్పింది ఎంటి… ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని, 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు… వారితో రాజీనామా చేయిస్తే ఆ 26 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందన్నారు బండి సంజయ్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ అన్నారు. రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని, కొందరు గోతి కాడి నక్కల్ల ఎదురు…
స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు.. నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాశానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాల అభివ్రుద్ధికి మహార్ధశ పట్టనుందని, గత బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించడంవల్లే అభివ్రుద్ధి కుంటుపడిందన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ పార్టీ ఫిరాయింపుల పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాలనే నేడు కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందన్నారు.
కరీంనగర్ జిల్లాలోని ఇళ్ళంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఆనతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ కార్యకర్తలు, నాయకులు కష్ట పడి పని చేయడం వల్లె తనకు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ఇల్లంతకుంట దేవస్థానం నుండి ప్రచారం ప్రారంభించానని, తనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కిందన్నారు. అందుకోసం మళ్ళీ ఈ దేవస్థానంలో స్వామి వారి…
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని ..
Bandi Sanjay: గ్రూప్-1 అభ్యర్థులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం సమావేశమయ్యారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం ప్రిలిమ్స్ నుండి 1:100 ఎంపిక కోసం చూసేందుకు నిరుద్యోగులు ఉన్నారు.
కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక స్వామి వారి ఆశీర్వాద కోసం వచ్చానని..మొన్నటి ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం 43 వేల మెజారిటీ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన బిక్ష అని..సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణమని బండి సంజయ్ అన్నారు. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని గుర్తుచేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎల్లుండి (జూన్19న) కరీంనగర్ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమర్ కు ఘన స్వాగతం పలికేందుకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ శ్రేణులు సిద్దమయ్యాయి. వాస్తవానికి ఈనెల 19న ఇద్దరూ కలిసి రాష్ట్రానికి రావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ భావించారు. అయితే 19న సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీకి హాజరు కావాలని కొద్ది సేపటి క్రితం…