‘అగ్నిపథ్’ మంచి పథకమని పేర్కొంటూ ప్రతిపక్షాలు విద్యార్థుల్లో గందరగోళం సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ మైలేజీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. పథకంలో ఏదైనా సమస్య ఉంటే సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాల కుట్రలో ఇరుక్కుని విద్యార్థులు నిర్ణయాత్మకంగా ఉండవద్దని సూచించారు. ఆదివారం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ నుండి ప్రాతినిధ్యాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి…
భారతీయ సంస్క్రుతి గల గల పారే జీవనది లాంటిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భారతీయ సంస్క్రుతి, సాంప్రదాయాలపై దాడి చేస్తూ సమాజంలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సమాజాన్ని ఏకం చేస్తూ భారతీయ విలువలు పెంపొందిస్తూ ప్రజ్ఝాభారతి ఆధ్వర్యంలో ‘లోక్ మంథన్’ పేరుతో చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో ఈరోజు సాయంత్రం జరిగిన ‘లోక్ మంథన్ సన్నాహక సమావేశానికి’ బండి సంజయ్ హాజరై…
కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి.. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
దేశంలోని మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా? ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోం మంత్రి…
రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని, గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో… కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమిని ఆయన విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క గారు… మీరు చదివింది ఆర్థిక బడ్జెట్టా…
ఇది దేశ హిత బడ్జెట్ అని, మోడీ విజనరీకి అద్దం పట్టేలా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బండి సంజయ్ స్పందిస్తూ.. నాగలికి రెండు ఎడ్ల మాదిరిగా అభివ్రుద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకగా ఉంది. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే…
మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ పొగడతలతో ముంచెత్తారు. ఉద్యమం చేసి ప్రజల్లో అభిమానం ఉన్న నేత అని అన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు.. హరీష్ రావు ప్రజల మనిషి అని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు అంటూ, హరీష్ రావు మంచి నాయకుడు పొగిడారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలతో చర్చలు జరిపారా అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించారు.
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బండి సంజయ్ విమర్శించారు. స్వామి వారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని… స్వామికి, టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారని బండి సంజయ్ విమర్శించారు. అంతేకాకుండా.. ఇతర మతస్తులకు అధికారాన్ని అప్పగించి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లు వీరప్పన్…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కమ్యూనిటీ కళ్యాణ మండపానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎములాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. కసితో ప్లాన్ ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని బండి సంజయ్ తెలిపారు. రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందని…