కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక స్వామి వారి ఆశీర్వాద కోసం వచ్చానని..మొన్నటి ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం 43 వేల మెజారిటీ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక్కడి ప్రజలు ఆదరించారన్నారు. వారి రుణం తప్పక తీర్చుకుంటానని తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ స్వామి వారు ఎంత పవర్ ఫుల్ లో కేసీఆర్ కుటుంబానికి తెలుసన్నారు. ఏడాదికి రూ.400 కోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారని..ప్రసాద్ స్కీం కింద పెడదామన్న సహకరించలేదని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధి పేరుతో కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టారన్నారు. దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి జరుగుతుందనడానికి కేసీఆర్ సర్కారే నిదర్శనమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నానన్నారు.
READ MORE: Raghunandan Rao: “బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా తయారైంది”..బీఆర్ఎస్ పై రఘునందన్ ఫైర్
రాజకీయాలకతీతంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకొని భక్తులకు సౌకర్యాలు పెంచుకోవలసిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని.. నేను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఎన్నికల ముందు రాజన్నను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శించుకున్నందున కేంద్రంలోనూ రాజన్న ఆలయ విశిష్టత పై చర్చ జరిగిందని పేర్కొన్నారు. నాకు ఇచ్చిన మెజార్టీ ప్రజల ఆకాంక్షను అనుగుణంగా పనిచేసే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయ అభివృద్ధి చేయాలనే హామీకి కట్టుపడి పనిచేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానని.. ఆలయ విస్తరణ విషయంలో కమిట్ మెంట్ తో పనిచేస్తానని వెల్లడించారు. అభివృద్ధి చేసి తానేంటో చూపిస్తానన్నారు.