Bandi Sanjay: తెలంగాణ లో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. స్మార్ట్ సిటీ పనుల గడువు పెరగడం వల్ల కరీంనగర్ కి మరిన్ని నిధులు వస్తాయన్నారు. రేవంత్ ఒక్కడే అడిగితే స్మార్ట్ సిటీల అభివృద్ధి గడువు పొడిగించలేదు… వివిధ రాష్ట్రాల సీఎంలు అడిగారని కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ ,కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. వేములవాడ ఆలయాన్ని ఈసారి ప్రసాదం స్కీంలో చేర్చుతామన్నారు. రామాయణ సర్క్యూట్ కింద ఇళ్లందకుంట, కొండగట్టు దేవస్థానాలను చేర్చాలని ప్రతిపాదన ఉందన్నారు. కరీంనగర్ హాసన్ పర్తి రైల్వే లైన్ సర్వే పూర్తయిందన్నారు.
Read also: CM Chandrababu Naidu: ఆంధ్రపదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు..
కరీంనగర్ కి ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాసంస్థల కోసం ప్రయత్నం చేస్తానని తెలిపారు. తెలంగాణ లో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ బీజేపీ లో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని.. అందుకే వాళ్లు తర్జనభర్జన అవుతున్నారని సంచలన వ్యాక్యలు చేశారు. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న కేకే లాంటి వాళ్లని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలను వారి ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని.. త్వరలో పార్టీ ప్రెసిడెంట్ ని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు.
Read also: Ration Cards: రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ ..రేషన్ కార్డులో సవరణలపై గ్రీన్ సిగ్నల్..
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు భాగ్య నరగ వాసులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి ట్విట్టర్‌లో రాశారు. “ఆషాడ మాసం అమ్మవారి బోనం.” అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ… ఈ ఆషాఢంలో పోతన కీర్తించిన అమ్మవారిని పూజిస్తే మనల్ని చల్లగా చూస్తుంది. అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ. అమ్మవారి ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ హిందూ బంధువులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. బండి సంజయ్ రాశారు.
Group1 Prelims Results: గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల ..