Bandi Sanjay : నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాసిన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు.. నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాశానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాల అభివ్రుద్ధికి మహార్ధశ పట్టనుందని, గత బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించడంవల్లే అభివ్రుద్ధి కుంటుపడిందన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి ధన్యవాదాలు. కేంద్ర నిర్ణయంవల్ల కరీంనగర్, వరంగల్ పట్టణాలు పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి అయ్యే అవకాశాలు మెరుగయ్యాయని ఆయన తెలిపారు.
స్మార్ట్ సిటీ నిధులను విడుదల చేయాలని గతంలో నేను మూడు సార్లు లేఖ రాశాను. కరోనా వల్ల రెండేళ్ల కాలం వ్రుధా కావడంతో స్మార్ట్ సిటీ మిషన్ ను పొడిగించాలని కోరాం. బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వచ్చిన విజ్ఝప్తులపట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వచ్చే మార్చి నెలాఖరు వరకు స్మార్ట్ సిటీ మిషన్ ను పొడిగించినందుకు సంతోషంగా ఉంది.
కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాలకు మహర్ధశ రానుంది. పూర్తిస్థాయిలో అబివ్రుద్ధి చెందే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే కేంద్ర నిధులు దారి మళ్లించకుండా చూడటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మ్యాచింగ్ గ్రాంట్ నిధులను సకాలంలో మంజూరు చేసి అభివ్రుద్ధికి సహకరించాలి.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ నిధులను దారి మళ్లించింది. కేంద్రం విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించి సత్వర పనులు పూర్తి చేసినట్లయితే కరీంనగర్, వరంగల్ పట్టణాలు ఇప్పటికే అద్దంలా మెరిసేవి. కానీ రాష్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేయకపోవడంతోపాటు కేంద్ర నిధులను కూడా దారి మళ్లించింది. నేను పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ లో నిలదీసిన తరువాత కేంద్ర నిధులను జమ చేశారు.
గత పాలకులు కమీషన్లకు కక్కుర్తి పడటంవల్లే స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం జరిగింది. కాంట్రాక్టర్ నుండి కమీషన్లు దొబ్బడం కొందరు పాలకులకు ఆనవాయితీగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మళ్లీ కమీషన్ల కోసం అవతారమెత్తారు. తక్షణమే స్మార్ట్ సిటీ నిధుల అవతవకలు, కమీషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.’ అని బండి సంజయ్ తెలిపారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!