CM Revanth Reddy: కేటీఆర్..హరీష్ రావు..సెక్రటేరియట్ రండి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం చేసింది రెండే రెండు అన్నారు. ఒకటి తప్పులు..రెండోది అప్పులు అన్నారు....
పవన్ కల్యాణ్‌కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శక్తిమంతమైన మాటలు మాట్లాడారని, సంపూర్ణంగా ఆయనకు మద్దతుగా నిలుస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’పై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడదుల చేశారు. అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణ కోరాలని, దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయన్నారు. ఈ…
మొదటి రోజు ముగిసిన ఆట.. భారీ స్కోర్ దిశగా భారత్ చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్‌లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (86*), అశ్విన్ ఉన్నారు. తొలి రోజు ఆటలో ముగ్గురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్..…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా 10 తరగతి విద్యార్థినిలతో మమేకమై మాట్లాడారు బండి సంజయ్. విద్యార్థినులతో పై చదువులు చదివిన తర్వాత మీరు ఏమవుతారు అని అడుగగా టీచర్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని సమాధానం చెప్పిన విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థినిపై కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 1 లక్ష 9 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని విద్యార్థినులకు తెలిపారు బండి సంజయ్. 2019 లో…
నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇచ్చిన హామీలతోపాటు ప్రజా సంక్షేమం అనేక కార్యక్రమాలు చేపట్టినం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయించినం. కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినం. ముద్రా రుణపరిమితిని పెంచినం.…
Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండిసంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. హిందువుల పండుగులకే ఆంక్షలు, బంధనలు ఎందుకు అని ప్రశ్నించారు.
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు.