Bandi Sanjay: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచలోనే 5వ స్థానానికి చేర్చిన ఘనత మోడీ దే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవ’ వేడుకలకు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గత ప్రభుత్వాలన్నీ తెలంగాణ విమోచన చరిత్రను భూస్థాపితం చేసేందుకు కుట్ర చేసిందన్నారు. గత పాలకులు చరిత్రను వక్రీకరించకపోయి ఉంటే పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం మాదిరిగానే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ పండుగ చేసుకునేటోళ్లని తెలిపారు. 1947 పంద్రాగస్టున దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ పోరాట వాస్తవాల చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘రజాకార్’ అన్నారు. ఈ సినిమా తీసిన గూడూరు నారాయణరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భావితరాలకు నిజానిజాలు తెలియజేసేందుకే కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన పీఎం మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలకు క్రుతజ్ఝతలు తెలిపారు.
Read also: BJP Leader Kolanu Shankar: బాలాపూర్ లడ్డూను ప్రధాని మోడీకి అందిస్తాం..
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటం ఏ వర్గానికో, ఏ పార్టీకో వ్యతిరేకం కానే కాదన్నారు. దేశభక్తులకు, దేశ విభజన ద్రోహులకు మధ్య జరిగిన పోరాటమిది అన్నారు. భూమి కోసం, భుక్తి కోసమే కాదు తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లను తెంచి స్వేచ్చా వాయువుల పీల్చుకునేందుకు జరిగిన పోరాటమిది అని తెలిపారు. కుల, మత, వర్గాలకు అతీతంగా నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన చరిత్ర తెలంగాణ సొంతం అన్నారు. రోకలిబండలు, కారంపొడులు పట్టుకొని రజాకార్లను తరిమి కొట్టిన చరిత్ర మన తెలంగాణ ఆడబిడ్డల సొంతం అన్నారు. నాటి పోరాటాలను, త్యాగాలను, తెలంగాణ తెగువను నేటి తరానికి తెలియజేసేందుకే ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ అని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆక్రుత్యాలను తలుచుకుంటే ఇప్పటికి నా రక్తం మరుగుతుందని తెలిపారు. పరకాల, బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, వెయ్యి ఊడల మర్రిలో రజాకార్ల దురాగతాలను మర్చిపోగలమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతి గ్రామానికి రజాకార్లపై పోరాడిన చరిత్ర ఉందన్నారు.
Read also: CM Revanth Reddy: పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. దాశరథి కవితతో సీఎం ప్రసంగం..
ఈ మట్టిలో, ఈ గాలిలొ, ప్రతి నీటి చుక్కలో బానిసత్వానికి, నిరంకుశత్వానికి రాజరికానికి ఎదురొడ్డి పోరాడి నిలిచి గెలిచిన స్ఫూర్తి ఉందన్నారు. నా తెలంగాణా పోరాటాల పురిటి గడ్డ. ఈ గడ్డ మీద పుట్టినoదుకు గర్వపడుతున్న. తెలంగాణ స్వాతంత్రోద్యమంలో ఆర్య సమాజ్, హిందూ మహా సభ వంటి ఎన్నో సంస్థలు పని చేసినాయని అన్నారు. ఈ తరం ఉస్మానియా వర్శిటీలో జై తెలంగాణా నినాదాలను చూస్తే… వందేమాతరం నినాదాలతో గర్జించిన చరిత్ర నాటి తరానిది అన్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ లేకపోతే తెలంగాణకు అంత జల్డి విముక్తి లభించేది కాదన్నది నగ్న సత్యం అని తెలిపారు. తెలంగాణను పాకిస్తాన్ ల కలపాలని, లేకుంటే స్వతంత్ర రాజ్యంగా ఉండాలని ప్లాన్ చేసిన కాశీం రజ్వీ పార్టీదే ఎంఐఎం అంటూ ఆరోపించారు. నిజాం చేతిలో తెలంగాణ బందీగా ఉంటే భరతమాత కడుపులో కేన్సర్ గడ్డ ఉన్నట్లేనని గుర్తించిన మహానేత సర్దార్ పటేల్ అని తెలిపారు. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో రక్తం చుక్క చిందకుండానే… నిజాం మెడలు వంచి తెలంగాణకు విమోచనం కలిగించిన మహనీయుడు సర్దార్ పటేల్ 8 వందల ఏండ్లు విదేశీయుల పాలనతో రక్తసిక్తమై తల్లడిల్లిన నా తల్లి భరతమాతకు ఆపరేషన్ చేసి పునర్ వైభవం కలిగించిన సర్దార్ పటేల్ నిజమైన దేశభక్తుడు అనిత తెలిపారు.
Read also: GHMC Office: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మొట్టమెదట తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి సీహెచ్.విద్యాసాగర్ రావు ఉద్యమ స్పూర్తిని మరువలేమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడమంటే నాటి సమర యోధుల త్యాగాలను, బలిదానాలను అవమానించడమే అని తెలిపారు. మేము సామాన్య ముస్లిం ప్రజలకు ఎన్నడూ వ్యతిరేకం కాదు.. ముస్లింలంతా రజాకార్లు కారన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ నుండి విడదీసి ప్రత్యేక దేశంగా మార్చాలని, సాధ్యంకాని పక్షంలో పాకిస్తాన్ లో విలీనం చేయాలని నిజాం రాజు కుట్ర చేసిండన్నారు. ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓట్లు రావాలని లక్షలాది మంది ముస్లింలను తెలంగాణకు తీసుకురావడంతోపాటు దాదాపు అదే సంఖ్యలో హిందువులు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్లేలా చేసిన సంగతిని మర్చిపోవద్దని తెలిపారు. దేశ విచ్చిన్నకర శక్తుల వారసుల పార్టీతో రాష్ట్రంలో రాజకీయ పార్టీ లు అంటకాగడం సిగ్గు చేటన్నారు.
Read also: Big Breaking: ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన..
అధికారంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించినోళ్లే అధికారంలోకి వచ్చాక మాట మార్చడం సిగ్గు చేటని తెలిపారు. ‘తెలంగాణ సమైక్యతా దినోత్సవం’ అని ఒక పార్టీ, ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ అని మరొక పార్టీ ప్రజలను ఏమార్చాలనుకోవడం బాధాకరం అన్నారు. ఒక్క రోజే పాలన చేసి మిగిలిన రోజులు దోసుక తినడమేనా ‘తెలంగాణ ప్రజా పాలన అంటే’? అని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 గ్యారంటీ లను అటకెక్కించి ప్రజలను ఏమార్చడమే ‘ప్రజా పాలనా దినోత్సవానికి గీటురాయి’ అనుకోవాల్నా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం కులాలు, వర్గాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలనుకోవడమే ‘తెలంగాణ సమైక్యతా దినోత్సవానికి గీటురాయి’ అనుకోవాలా? అని తెలిపారు. పిడికెడు మంది రజకార్ల వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంత వరకు న్యాయం? అన్నారు. తెలంగాణలో పుట్టిన బిడ్డలైతే రోషం ఉండాలే….. పౌరుషం ఉండాలే….. ఇజ్జత్ ఉండాలే….. అని తెలిపారు. ఇప్పుడైనా మీ మనస్సులో ఉన్న మలినాన్ని కడిగేసుకోండి అన్నారు.
Read also: Balapur Ganesh Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతంటే..?
రజకార్ల వారసుల సంతూష్టీకరణ విధానాలను విడనాడండి అని పిలుపునిచ్చారు. భారత దేశం గెజిట్ ప్రకటించినందున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ నిర్వహిస్తే కేంద్రం భాగస్వామి అయ్యేందుకు సిద్ధం అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా తెలంగాణలోని విశ్వకర్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచలోనే 5వ స్థానానికి చేర్చిన ఘనత మోడీ దే అన్నారు. తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేసుకుందామన్నారు. అభివృద్ధి ఫలాలను అట్టడగువర్గాల ప్రజలకు సైతం అందేలా నిరంతరం పాటుపడదామని తెలిపారు. తద్వారా నాటి మన పెద్దలు కలలు గన్న రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు.
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం బాహుబలి సూపర్ క్రేన్..