నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. తాను అశోక్ నగర్ వచ్చి గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు బండిసంజయ్. పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంస్థలతో కలిసి.. గ్రూప్-1 అభ్యర్థులతో పాటు వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. గ్రూప్1 అభ్యర్థులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు.…
గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీ ఛార్జీ చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై లాఠీచార్జి ని ఖండిస్తున్నామని, ప్రభుత్వం గ్రూప్ 1 విషయంలో తప్పు చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారని, ఇది చిల్లర చర్య…. ఈ జీవో ఎవరి ఆలోచన అని, గ్రూప్స్ పరీక్షను వాయిదా వేయాలి… జీవో-29 పై చర్చ చేయండన్నారు. షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు… ఇదేం పద్ధతి, ప్రభుత్వం అబద్దాలు…
Bandi Sanjay: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి విషయంలో మాత్రం రాజీలేకుండా పనిచేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు పొన్నంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకుని…
CM Revanth Reddy: కేటీఆర్..హరీష్ రావు..సెక్రటేరియట్ రండి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం చేసింది రెండే రెండు అన్నారు. ఒకటి తప్పులు..రెండోది అప్పులు అన్నారు....
పవన్ కల్యాణ్కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శక్తిమంతమైన మాటలు మాట్లాడారని, సంపూర్ణంగా ఆయనకు మద్దతుగా నిలుస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’పై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడదుల చేశారు. అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణ కోరాలని, దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయన్నారు. ఈ…