Bandi Sanjay: శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం..
- శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం..
- విశ్వగురు స్థానంలో భారత్ ను ఉంచేందుకు మోదీ చేస్తున్న కృషి ఫలించాలి..
- కరీంనగర్ పార్లమెంట్ సహా తెలంగాణ అభివ్రుద్ధిలో భాగస్వాములవుదాం..
- హిందూ బంధువులందరికీ బండి సంజయ్ దసరా శుభాకాంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం ఆవరణలో బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలు, భక్తులతో కలిసి శమీ పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాతూ.. హిందూ బంధువులందరికీ పవిత్రమైన శక్తివంతమైన విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికీ విజయాలు అందించాలి. స్వార్ధం, కల్మషం వీడి శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దాం. కష్టసుఖాలను పంచుకుందాం అన్నారు.
గతంలో జరిగిన మంచి చెడులను బేరీజు వేసుకుని మంచి జరిగేలా అమ్మవారిని వేడుకుందాం. గతంలో పడిన కష్టాలు, ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. అందరిలో మంచి ఆలోచనలు కలిగాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో ఎలాంటి అవరోధం లేకుండా విజయం చేకూర్చాలి. భారతమాతను విశ్వగురు స్థానంలో ఉంచేందుకు మోదీ చేస్తున్న క్రుషి సాకారమయ్యేలా అమ్మవారి ఆశీస్సులందించాలి. అట్లాగే కరీంనగర్ పార్లమెంట్ తోపాటు తెలంగాణ అభివ్రుద్ధి చెందేలా అందరం కలిసి భాగస్వాములు కావాలని అమ్మవారిని వేడుకున్నా అన్నారు.
Dasara Effect Liquor Sales: తెగ తాగేశారు.. 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం..
Also Read
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..