ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి : జేపీ నడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నేడు బీజేపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే జేపీ నడ్డాను అడ్డుకునేందుకు అప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పోలీసులు తెలంగాణలోని కోవిడ్ నిబంధనల గురించి వివరించారు.
దీంతో ఆయన కోవిడ్ నిబంధనల ప్రకారమే నిరసన తెలియజేస్తానన్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌లోని మహాత్మగాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ మహాత్ముడికి నివాళులు అర్పించారు. అయితే అందరూ ర్యాలీ నిర్వహిస్తారనే ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా నిరసనను అక్కడే ముగించి నేరుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి జేపీ నడ్డా వెళ్లారు. అయితే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చానని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, అవినీతి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం కోనసాగిస్తామన్నారు.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు చేయిచేసుకున్నారని, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లు.. కేసీఆర్ పాలన ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం వస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!