భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది… మూడో విడతలో 11 నియోజకవర్గాలు, 5 జిల్లాల గుండా ఆయన పర్యటన సాగింది.. ఈ సారి 300.4 కిలోమీటర్లను చేరుకోవడంతో యాత్ర ముగియనుంది.. మొత్తంగా 3 విడతల్లో కలుపుకేంటే 1121 కిలోమీటర్లు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంజయ్ పాదయాత్ర సాగింది… వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు చేరుకోవడంతో మూడో విడత పాదయాత్ర ముగినుంది..…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజసంగ్రామ పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశ పాదయాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు. అయితే.. రేపు మూడో దశ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో వరంగల్లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే ఈ క్రమంలో వరంగల్లో ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు లేవంటూ.. వరంగల్ పోలీస్…
బండి సంజయ్ పాద యాత్రలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బండిసంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్కార్యకర్తల నినాదాలతో జనగామ జిల్లాలో ఉద్రికత్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేసేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. దీంతో కొందరికి స్వల్పగాయాలు అయ్యాయి. బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలు నినాదాలు హోరెత్తాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు…