బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయి.. వడ దెబ్బకు గురైన బండి సంజయ్.. తన పాదయాత్రకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వనున్నారని వాటి సారాంశం.. అయితే, దీనిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.. బండి సంజయ్ రెండో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది… ప్రజా సంగ్రామ యాత్ర యథావిథిగా కొనసాగుతుందని…
జోగులాంబ గద్వాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి… టీఆర్ఎస్, బీజేపీ నేతల పోటాపోటీ నినాదాలు, కారు ధ్వంసం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది.. అయితే, ఈ ఘటనపై స్పందించిన గద్వాల జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి.. అసలు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను మేం అడ్డుకోలేదు.. టీఆర్ఎస్‌కు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన రెండో దశ పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. అయితే, ఇవాళ సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించాయి. ఇటిక్యాల మండలం వేములలో బండి సంజయ్ పాదయాత్రకు నిరసన వ్యక్తం చేశారు. ఇక, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజుల ప్రశాంతంగా కొనసాగిన యాత్రలో ఐదో రోజు…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభ నిర్వహణకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాబోతున్నారు.. మెత్తం 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు బండి సంజయ్.. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను…
యువనేతలు ఎదగాలంటే సరైన సందర్భాలు కావాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.అప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. తెలంగాణ బిజెపి యువనేతలకు సంజయ్ యాత్ర రూపంలో ఓ ఛాన్స్ వచ్చింది. తమ టాలెంట్ రుజువు చేసుకోటానికి శాయశక్తులా కష్టపడుతున్నారట. పాదయాత్ర చేస్తున్న సంజయ్ టార్గెట్ ఒకటైతే, వారసుల టార్గెట్ మరొకటిగా మారింది.. సంజయ్ సంగ్రామ యాత్రలో నేతల వారసులు హడావుడి చేస్తున్నారు. పనిలో పనిగా కమలం పార్టీలో తమ భవిష్యత్ కి గట్టి పునాదులు వేసుకుంటున్నారు. పాదయాత్ర వేదికగా తమ…
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే 14 రోజులు పూర్తి చేసుకున్న బండి పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది.. ఇవాళ సంగారెడ్డిలోని సంగుపేట నుంచి చిట్కూల్ వరకు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర కొనసాగనుంది.. ఇక, జోగిపేట్ మెయిన్ రోడ్.. హనుమాన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు.. మరోవైపు, సంజయ్‌తో పాటు ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.. ఇప్పటికే 100 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది.. ఇక, సంజయ్ పాదయాత్రలో కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ సీఎంలు.. ఇలా రోజుకో నేత పాల్గొంటున్నారు. ఇవాళ బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య.. సంజయ్ పాదయాత్రలో కొద్దిసేపు తెలుగులోకి మాట్లాడారు తేజస్వి సూర్య.. బండి సంజయ్ చేసేది పాదయాత్ర కాదు కేసీఆర్ మీద చేసే దండ యాత్ర అన్న ఆయన.. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్…
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరుకుంది.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన ఆయన.. రెండో రోజు గోల్కొండ కోట దగ్గర బహిరంగసభ నిర్వహించారు.. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.. ఇక, ఇవాళ సంజయ్ పాదయాత్ర మూడో రోజుకు చేరుకోగా.. తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్, ఆరే మైసమ్మ దర్శనం తర్వాత సభ నిర్వహించి లంచ్…
తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది.. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరిపోయారు.. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు.. రేపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సాగనున్న సంజయ్ పాదయాత్ర.. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.. ఆగస్టు 24న హైదరాబాద్ ఓల్డ్‌సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. అయితే, మరోసారి సంజయ్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది… ఎందుకంటే.. యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు..…