రేపటి నుంచే బండి సంజయ్ పాదయాత్ర.. సాగనుంది ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది.. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరిపోయారు.. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు.. రేపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర నిర్వహించనున్నారు.
ఇక, రోజుకు మినిమం 10 కిలోమీటర్లు పాద యాత్ర చేయనున్నారు బండి సంజయ్.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ పరిధిలోనే ఆయన పాదయాత్ర కొనసాగనుంది.. రేపు రాత్రి మెహిదీపట్నంలోని పుల్లా రెడ్డి కాలేజ్‌లో బసచేయనున్న ఆయన.. ఎల్లుండి రాత్రి బాపు ఘాట్ దగ్గర బస చేస్తారు.. రేపు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుండి ప్రారంభం అయ్యే యాత్ర.. మదినా, అఫ్జల్ గంజ్, బేగం బజార్, ఎంజే మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వరకు తొలిరోజు బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. కాగా, బండి సంజయ్ పాదయాత్ర ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి యాత్ర కోసం ఒకసారి అయితే.. యూపీ మాజీ సీఎం మృతితో రెండోసారి వాయిదా పడింది సంజయ్ పాదయాత్ర.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!