సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. దళిత బంధుపై ఎవరి నిజాయితీ ఏందో యదాద్రిలో తేల్చుకుందాం.. దమ్ముంటే అక్కడికి రావాలని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. దళిత బంధు ఆపాలని బీజేపీ ఎక్కడా లేఖలు ఇవ్వలేదన్నారు. ఇవాళ హుజురాబాద్ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస ఇచ్చే 20 వేలు తీసుకుని.. ఓటు మాత్రం బీజేపీకి వేయాలని కోరారు.
దళిత బంధు ఎవరు ఆపమని అడగలేదని.. కేసీఆర్ కి అహంకారం పెరిగిందని ఫైర్ అయ్యారు. GHMC ఎన్నికల్లో 10 వేలు ఇస్తా అని మోసం కేసీఆర్ మోసం చేశాడని… దళితబంధు కి కూడా సంతకాలు ఫోర్జరీ చేసి లెటర్స్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు డబ్బులు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది బీజేపీ అని… ఇవ్వకుండా ఆపింది మాత్రం కేసీఆర్ అని మండిపడ్డారు. అందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దళితులకు రూ.10 లక్షలు ఇవ్వాలి లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.