Bandaru Dattatreya Daughter: అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి అభ్యర్థిగా బండారు విజయ లక్ష్మీ దరఖాస్తు చేసుకున్నారు.
తండ్రి పెద్ద పదవిలో ఉంటే.. మామ కూడా రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే టైమ్ అనుకున్నారో ఏమో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట ఆ యువ మహిళా నేత. నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్టు కాషాయ శిబిరంలో టాక్. ఇంతకీ ఎవరా మహిళా నేత? రాజకీయంగా బండారు విజయలక్ష్మి యాక్టివ్ రోల్..! తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతల వారసులు క్రమంగా తెరపైకి వస్తున్నారా? హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి…