గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. గతంలో గవర్నర్లు హుందాగా ప్రవర్తించే వారని, క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్ర వేత్తనా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై బాల్క సుమన్ మండిపడ్డారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రిగా చేసింది…
బీజేపీ లో ఈటెల రాజేందర్ ది బానిస బతుకు బతుకుతున్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రిగా చేసింది కేసీఆర్ యే అంటూ గుర్తు చేసారు. ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారంటూ మండిపడ్డారు. ఆరోగ్య మంత్రిగా.. ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారాడని విమర్శించారు. హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయమని స్పష్టం…
బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ చేసి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రారని..వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని తరుణ్ చుగ్ కామెంట్లు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది టీఆర్ఎస్ కు కాదని.. బీజేపీకి అని విమర్శించారు.…
ఆయన పాన్ షాపు సంజయ్..! ఈయన కుర్కురే రెడ్డి.. ! అంటూ.. బండి సంజయ్ , కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బాల్కసుమన్ సెటైర్లు విసిరారు. అగ్ని పథ్ పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి భాద్యత మోడీ సర్కార్ దే.. మరెవ్వరిది కాదని మండిపడ్డారు. ఆర్మీలో చేరడాన్ని దైవ కార్యంగా యువత భావిస్తుందని కొనియాడారు. ఇలాంటి స్కీం ను కూడా మిగతా మూర్ఖపు స్కీం లాగా మోడీ తెచ్చి యువత ఆగ్రహానికి కారణమయ్యారని మండిపడ్డారు.…
అమిత్ షా మాటలను మరోసారి నరేంద్రమోదీ రిపీట్ చేశారు అంతే.. అంటూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నిన్న జరిగిన మోడీ హైదరాబాద్ పర్యటలో భాగంగా.. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనపై మోడీ ప్రస్తావించడంతో.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. మోడీ మాటలకు ఈ సందర్భంగా చురకలంటించారు. నరేంద్రమోదీ మాటలను టీఆరెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నరేంద్రమోదీ పచ్చివ్యతిరేకి అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం…
కొత్త థియేటర్లో పాత సినిమా లాగా కాంగ్రెస్ సభ ఉందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఆ సభ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. చావు నోట్లో తలపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బైండోవర్ కేసులు పెట్టి నిర్బంధించారని బాల్క సుమన్ పేర్కొన్నారు. పండుగలు కూడా చేసుకోలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. Read Also: Minister Niranjan Reddy: టీఆర్ఎస్ను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరు..? చంద్రబాబుకు ఏజెంట్గా…