ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు ఈసారి ఇరిటేషన్ తెప్పిస్తున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన మీద, తన కుమారుడి మీద తరచూ అర్థం లేని ఆరోపణలు చేస్తూ బురద చల్లాలని చూడటం విసుగు తెప్పిస్తుందన్నారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. పార్టీ మారే ఉద్దేశ్యం ఉంటే ఇక్కడికి రాను అని తెలిపారు. నాలుగేళ్ల మంత్రి పదవి వదులుకుని జగన్ కోసం వచ్చిన వాడిని.. ముఖ్యమంత్రి దగ్గరకు రావటానికి నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు.
అన్నీ ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యనించారు. కోర్టు ఏ నిర్ణయంతో.. వాస్తవాలు తెలుస్తాయి.. చంద్రబాబును జైలుకు పంపించాలని టార్గెట్ చేసుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు.. చంద్రబాబును అరెస్టు చేయటానికి ఐదేళ్లు ఎదురు చూస్తారా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
YV Subba Reddy: మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జమిలీ కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామన్న ఆయన సీఎం జగన్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు త�