ఏపీలో ప్రస్తుతం పొత్తుల రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది. కర్నూలు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ మంత్రులు, కీలక నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సంవత్సరాలు సీఎంగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు సొంత పార్టీపై నమ్మకం లేదని బాలినేని విమర్శించారు. అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.…
మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ వార్తలు వచ్చాయి. దాన్ని ఆరోజే ఖండించాను. మాపై ఇలాంటివి రాసిన వారిపై పరువునష్టం దావా వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం ఆలోచన ప్రకారమే పదవులు ఇస్తారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ నేను పాకులాడలేదు. ఆరోజు చెప్పగానే 24 మంది రాజీనామా చేశాం. మంత్రి పదవి లేనప్పుడు కొంచెం ఫీల్ అవటం ఎవరికైనా ఉంటుందన్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు. నేను వైయస్సార్ ఫ్యామిలీ…
జిల్లాల పునర్విభజన ఆ మంత్రులిద్దరికీ తలనొప్పులు తెస్తోందా? విపక్షాల విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు.. సీఎంకు ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారా? తరుణోపాయం తోచడం లేదా? ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రులెవరు? జిల్లా విభజన మార్పుకోసం మంత్రులపై ఒత్తిళ్లుప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. ఇద్దరిలో ఒకరు సీఎం జగన్‌కు దగ్గరి బందువు.. మరొకరు ఆయనకు ఆత్మీయంగా ఉండే సహచరుడు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ప్రకాశం జిల్లా మూడు ముక్కలైంది.…
వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగంపుపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. దీనిపై ఇవాళ కీలక ప్రకటన చేశారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తామని వెల్లడించారు.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పగటి పూటే 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన.. అనంతపురం జిల్లాలో తమకు రాత్రిపూట కరెంట్ ఇవ్వాలని అక్కడి రైతులు…