అభిమానులకు బాలకృష్ణ సందేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 10వ తేదీ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. కొన్ని దశాబ్దాలుగా అభిమానుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు బాలయ్య. ఎన్నో సంవత్సరాలు ఆయన సినిమా షూటింగ్ లోనే ఈ వేడుకను జరుపుకునే వారు. రాష్ట్రంలోనే కాదు రాష్ట్రేతర ప్రాంతంలో బాలకృష్ణ ఉన్నా… పుట్టినరోజును ఆయనను కలిసి, అభినందించి రావడం అనేది అభిమానులుకు ఆనవాయితీగా మారిపోయింది. అయితే కరోనా సమయంలో అలాంటి పనులను చేయవద్దంటూ బాలకృష్ణ హితవు పలుకుతూ ఓ సందేశాన్ని సోషల్ మీడియా మాధ్యమంగా అభిమానులకు తెలియచేశారు. అదే ఇది!
……….
నా ప్రాణ సమానులైన అభిమానులకు ..
ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు ..
నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి
సర్వదా విధేయుడ్ని ..
కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు ..
నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం
.. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను ..
మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు
మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు
మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక ..
దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ ..
ఈ విపత్కాలంలో అసువులు బాసిన
నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..
మీ నందమూరి బాలకృష్ణ ..
Also Read
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
తాజావార్తలు
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!