కరోనా సెకండ్ వేవ్ తో టాలీవుడ్ కుదేలయింది. ఎక్కడ షూటింగ్ లు అక్కడే ఆగిపోవడంతో పాటు పూర్తయిన సినిమాల రిలీజ్ లు ఎప్పుడనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. మళ్ళీ పరిస్థితి చక్కబడిన తర్వాతే సినిమాల విడుదల అంటున్నారు. అలా అందరికీ అనువైన సీజన్ గా దసరా కనిపిస్తోంది. ఈ ఏడాది దసరాకి పలువురు బడా స్టార్స్ సినిమాలు సందడి చేస్తాయంటున్నారు. ప్రత్యేకించి చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలు దసరాకే వస్తాయని టాక్. అదే నిజమైతే ఆ యా హీరోల అభిమానులకు పండగే. చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’గ రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, పాటతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ కూడా నటిస్తుండటం ఈ సినిమా అదనపు ఆకర్షణ. ఇక బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమాగా ‘అఖండ’పైనా అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించటమే దానికి ఉదాహరణ. ఇక వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’ తమిళ సూపర్ హిట్ ‘అసురన్’కి రీమేక్. ఇందులో వెంకీ లుక్ వైరల్ అయింది. ఇప్పుడు ఈ మూడు సినిమాలు దసరానే టార్గెట్ చేయటం గమనార్హం. కోవిడ్ మరో రెండు నెలలలో అదుపులోకి వస్తుందని దసరా పండగ ఆడియన్స్ కి అసలైన పండగ సందడిని అందిస్తుందని అంటున్నారు. ఒక వేళ అనుకున్నట్లు ఈ ముగ్గురు బడా హీరోలు దసరాకే వస్తే వార్ లో విజయం సాధించేది ఎవరన్నది ఆసక్తికరమైన అంశం. లెట్స్ వెయిట్ అండ్ సీ.