నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో “ఆదిత్య 369” సినిమా ఎప్పటికీ మరిచిపోలేనిది. టైం ట్రావెల్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనాలు సృష్టించింది. అయితే ఆ సినిమా షూటింగ్ లో నడుం విరిగింది అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ సినిమా విషయం ఎందుకు వచ్చిందంటే…. తాజాగా బాలయ్య అనారోగ్యం పాలైన తన అభిమానిని పరామర్శించారు. ఆ అభిమాని పేరు మురుగేష్. అతను శాంతిపురం మండలం గొల్లపల్లిలో నివసిస్తున్నాడు. ఇటీవల చెట్టుపై నుంచి పడి అనారోగ్యంతో మంచానికి పరిమితం అయ్యాడు మురుగేష్. ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణ ఈరోజు ఉదయం అతనిని ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా “ఆదిత్య 369” షూటింగ్ సమయంలో తనకు కూడా నడుం విరిగిందని, అయినా కోలుకున్నానని ధైర్యంగా ఉండాలని తన అభిమాని మురుగేష్ కు ధైర్యం చెప్పారు బాలకృష్ణ. మురుగేష్ కు 40 వేలు ఆర్థిక సాయం అందించారు బాలయ్య అభిమానులు.