నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి “అఖండ”. ఈ భారీ యాక్షన్ డ్రామాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. “సింహా”, “లెజెండ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ దర్శకుడు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ. తాజా సమాచారం ప్రకారం “అఖండ” చిత్రీకరణ పూర్తయింది. 10 రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కంప్లీట్ చేసేశారు. స్టంట్ కో-ఆర్డినేటర్ స్టన్ సిల్వా నిన్న సాయంత్రం ట్విట్టర్‌లో నందమూరి అభిమానులకు ఈ థ్రిల్లింగ్ అప్‌డేట్ ఇచ్చారు. అంతేకాదు బాలయ్య అభిమానులకు మరో క్రేజీ విషయాన్ని కూడా చెప్పారు. అదేంటంటే… “అఖండ” ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌తో పాటు ఇతర యాక్షన్ సన్నివేశాలు కోసం ఏకంగా ఎనభై రోజుల సమయం పట్టిందట. అంటే ఓన్లీ యాక్షన్ సన్నివేశాలకే చిత్రీకరణకే 80 రోజుల సమయం పట్టిందన్నమాట. అంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మరి! అవుట్‌పుట్‌తో టీం చాలా సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ తమిళనాడులో పూర్తయింది. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి “అఖండ” బృందం త్వరలో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అఖండ మొదటి సింగిల్ విడుదల చేయాలని భావిస్తున్నారు.
Read Also : “పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ “అఘోర” పాత్రలో కన్పించడం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి తమన్ అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న “అఖండ”లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు, పూర్ణ కూడా కీలకపాత్రల్లో కన్పించనున్నారు.