నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్”. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి ఆహా సిద్ధంగా ఉంది. మొదటి ఎపిసోడ్‌కు మంచు మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణు అతిధులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్నీ ఇటీవల విడుదలైన ప్రోమోలో ప్రకటించారు. అయితే పేరుకు తగ్గట్టుగానే షో ఉన్నట్టుగా ప్రోమో చూస్తే అన్పించింది. ఏదో తూతూ మంత్రంగా నాలుగు మాటలతో సరిపెట్టేయకుండా వివాదాస్పద ప్రశ్నలను సైతం ఈ షోలో బాలయ్య ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. నవంబర్ 4న ప్రసారం కానున్న “అన్ స్టాపబుల్” ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Read Also : ఇంటికి చేరుకున్న రజనీకాంత్.. ఆనందంలో అభిమానులు
ఇదిలా ఉండగా తాజాగా ఫిల్మ్ నగర్ లో ఈ షోకు సంబంధించి మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్లు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్”లో పాల్గొంటారని అంటున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. బాలయ్య, ఎన్టీఆర్ కలిసి ఒకే షోలో కన్పిస్తున్నడంటూ వస్తున్న ఈ వార్తలు నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నాని, రానా కూడా ఈ స్పెషల్ షోలో కనిపించనున్నారు.