వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య ఓ సినిమాలు చెప్పిన డైలాగ్‌కు అనువధించినట్లుగానే ప్రస్తుతం యూట్యూబ్‌లో పరిస్థితి నెలకొంది. అదేంటీ అనుకుంటున్నారా.. అవునండీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఆహాలో నందమూరి బాలకృష్ణ (ఎన్‌బీకే) హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో నిర్వహించారు. ఈ షోకు సంబంధించిన ప్రొమోను ఇటీవల యూట్యూబ్‌లో ఆహా విడుదల చేసింది.
దీంతో టీవీల్లో ఇంటర్య్వూలకే ఆసక్తి కనబరచని బాలయ్య ఏకంగా హోస్ట్ చేస్తున్నారా..? ఎలా ఉందో చూడాలి మరీ..? అంటూనే చూసేస్తున్నారు. ఈ ప్రొమో చూసిన వారు సంతృప్తి చెందక మానరు. ఎందుకంటే.. ఈ ప్రొమోలో బాలయ్య చేసిన అల్లరి, వ్యాఖ్యానించే విధానమే దానికి కారణం. ఈ ప్రొమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీన్నిబట్టి చూస్తుంటే.. ఈ షో ద్వారా ఆహా మెంబర్‌షిప్ తీసుకునే వారి సంఖ్య భారీగానే పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు.