కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. విషయం తెలియగానే ఆయన బెంగుళూర్‌కు వెళ్లారు. శనివారం కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పునీత్ రాజ్‌కుమార్ సోదరుడిని పరామర్శిస్తూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య పునీత్ మన మధ్య లేడన్న వార్తను నమ్మలేకపోతున్నాని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని బాలయ్య అన్నారు. రాజ్‌కుమార్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందన్న బాలయ్య ఒక…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. 46 ఎల్లా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఆయన పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరు…
నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆహా ఓటీటీ ద్వారా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా ఆయన హోస్ట్ అవతారంలో కనిపించనున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. అందులో యాంకర్‌గా బాలయ్య ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రోమోలో ‘నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య సిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప సిద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాపింగ్ ఉండదు.. సై అంటే సై…. నై…
నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే…
పాపులర్ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ జెట్ స్పీడ్ తో సరికొత్త షోలతో దూసుకెళ్తోంది. ‘ఆహా’కు, అందులో ప్రసారమవుతున్న షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి దిగ్గజ ఓటిటి సంస్థలు సైతం షాకవుతున్నాయని ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో లాంచ్ చేసిన వేదికపై తెలిపారు. తెలుగు ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘సామ్ జామ్’ అంటూ సమంతను హోస్టుగా మార్చి పలువురు సెలెబ్రటీలతో షో…
నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం’ అనే హీరోయిన్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయం కోసం కూతురు…
వారం రోజులుగా టీడీపీలో బాలయ్య హాట్ టాపిక్. ఆయన తీరు లాభమో.. నష్టమో.. తేల్చుకోలేకపోతున్నారట తమ్ముళ్లు. సున్నితమైన విషయాల్లో బాలయ్య టచ్ మీ నాట్‌గా ఉండాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఏ విషయంలో పార్టీ ఆందోళన చెందుతోంది? లెట్స్ వాచ్..! బాలయ్య వల్ల ఎదురయ్యే కష్టాలపై టీడీపీలో ఆరా? మా ఎన్నికలకు ముందు.. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎంత చర్చకు దారి తీశాయో.. దాదాపు అంతే చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతోంది. మా ఎన్నికల్లో…
అనంతపురం : హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ… వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని… జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హాయంలో వ్తెద్య సేవల కోసం తెచ్చిన వ్తెద్య పరికరాలు వాడకుండా మూలన పడివేశారని మండిపడ్డారు బాలకృష్ణ. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులపై జిల్లా…