ఆయన మరణం తర్వాత బాలయ్య ఏడ్చింది ఇప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. విషయం తెలియగానే ఆయన బెంగుళూర్‌కు వెళ్లారు. శనివారం కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పునీత్ రాజ్‌కుమార్ సోదరుడిని పరామర్శిస్తూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య పునీత్ మన మధ్య లేడన్న వార్తను నమ్మలేకపోతున్నాని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని బాలయ్య అన్నారు. రాజ్‌కుమార్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందన్న బాలయ్య ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని ఈ సందర్భంగా బాలయ్య అన్నారు. హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య కన్నీరు పెట్టింది కూడా ఇప్పుడే ..హరికృష్ణ మరణంతో బాలయ్య ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత పునీత్ మరణం తర్వాత బాలయ్య అంతలా కంటతడి పెట్టారు.
ఓ సినిమా ఫంక్షన్‌లో పునీత్ మాట్లాడుతూ .. శివరాజ్ తర్వాత నాకు అన్నయ్య బాలయ్య అని చెప్పిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మరో ఫంక్షన్‌లో పునీత్ బాలయ్య చెంపమీద ఏదో పడితే క్లీన్ చేశాడు. ఇది వారిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో తెలియజేస్తుంది. వీరి అనుబంధాన్ని ప్రతిబింబించే వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
తను నటించిన ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్‌కి కూడా పునీత్ వచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా ఆయన జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్టు బాలయ్య చెప్పారు. బాలకృష్ణతోపాటు టాలీవుడ్‌కు చెందిన చాలా మంది ప్రముఖులు పునీత్ పార్థీవ దేహాన్ని చూసేందుకు బెంగుళూరుకు వెళ్లారు. బాలయ్య చేరుకున్న కాసేపటికే ఎన్టీఆర్ కూడా చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ను హత్తుకుని ఓదార్చారు.
తాజావార్తలు
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!