మాస్ మసాలా చిత్రాలకు పేరుగాంచిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ డ్రామా “అఖండ”. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్. తాజాగా దీపావళి కానుకగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు . నందమూరి అభిమానులకు దీపావళి గిఫ్ట్ గా అఖండ టైటిల్ సాంగ్ రోర్ అంటూ ఓ చిన్న ప్రోమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ నవంబర్ 8న విడుదల కానుంది.
Read Also : “శ్యామ్ సింగ రాయ్” హిందీ రీమేక్ లో స్టార్ హీరో ?
“అఖండ”లో బాలకృష్ణ అఘోరి పాత్రలో కనిపిస్తారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీకాంత్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం “అఖండ”. ప్రముఖ స్వరకర్త ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. “అఖండ” చిత్రానికి ఎం రత్నం డైలాగ్స్ అందించారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.