“అఖండ” టీంలో మరోసారి కరోనా కలకలం రేగింది. భారతదేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే తెలుగు చాల చిత్ర పరిశ్రమలో మాత్రం ఇది రివర్స్ అయ్యేలా కన్పిస్తోంది. ఎందుకంటే షూటింగ్ సెట్ లో ఒక్కరికి కరోనా వచ్చినా అందరికీ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే కరోనా, లాక్ డౌన్ అనంతరం షూటింగులు మొదలు పెట్టడానికి మేకర్స్ కొంత సమయం తీసుకున్నారు. ఆ తరువాత కూడా సెట్లో పలు కరోనా నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు…
(అక్టోబర్ 9న ‘అపూర్వ సహోదరులు’కు 35 ఏళ్ళు)నందమూరి బాలకృష్ణ నటజీవితంలో ఒకే యేడాది ఆరు వరుస విజయాలు చూడటం అన్నది మరపురాని విజయం. 1986లో ఈ విశేషం చోటు చేసుకుంది. ‘ముద్దుల క్రిష్ణయ్య’తో ఆరంభమైన ఆ ఘనవిజయం ‘అపూర్వ సహోదరులు’తో పూర్తయింది. 1986లో బాలకృష్ణ చివరి చిత్రంగా వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ అక్టోబర్ 9న దసరా కానుకగా జనం ముందు నిలచింది. బాలకృష్ణ నటనాపర్వంలో తొలి ద్విపాత్రాభినయ చిత్రంగానూ ‘అపూర్వ సహోదరులు’ నిలచింది. ప్రేక్షక హృదయాలను గెలిచింది.…
నందమూరి నటసింహం బాలకృష్ణ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. అది చిన్న గాయమేనని, కంగారు పడాల్సిందేమీ లేదని సమాచారం. షూటింగ్ సమయంలో కాలికి దెబ్బ తగిలినప్పటికీ బాలయ్య దానిని పెద్దగా పట్టించుకోకుండా పనిపై దృష్టి పెట్టారు. అసలు ఆ గాయం ఏంటి ? షూటింగ్ ఎక్కడ జరిగింది ? అంటే… బాలయ్య ఓ టాక్ షోలో కన్పించబోతున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆహా కోసం బాలకృష్ణ ఓ టాక్ షోను నిర్వహించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నిన్న…
ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొంది. టాలీవుడ్ ప్రముఖుల హోస్టింగ్, ఇంటర్వ్యూలతో పాటు కొత్త సినిమాలతో ‘అహ’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా, తాజా సమాచారం ప్రకారం నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా స్పెషల్ టాక్ షోకి హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్యతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా పాల్గొంటారని సమాచారం.. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్ర షూటింగ్ నేటితో ముగిసింది.…
నటసింహ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు చిత్రబృందం తెలిపింది. చివరి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. త్వరలోనే ‘అఖండ’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసే…
‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి అధ్యక్ష పదవి ఎవరు చేపడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతోంది. అక్టోబర్ 10న అంటే మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న సివిఎల్ నరసింహా రావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు బండ్ల గణేష్ సైతం జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ హడావిడి చేసి చివరి…
నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25వ తేదీన హైదరాబాద్ దేవి 70ఎం.ఎం ధియేటర్ లో రాత్రి 9 గంటలకు బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో స్పెషల్ షో ప్రదర్శించారు. కరోనా కారణంగా థియేటర్లు కల కోల్పోయి కొత్త సినిమాలే ఫుల్ అవ్వని ఈ టైంలో స్పెషల్ షోలో ఆల్ టైం గ్రాస్ 1,58,682/- కలెక్షన్ వసూలు అయింది. అభిమానుల కేరింతలతో, జై బాలయ్య నినాదాలతో, బాణసంచా వెలుగులతో దేవి ధియేటర్…
విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీంకు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ “లైగర్” సెట్ ను సందర్శించారు. బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అనుకోని అతిథిలా వచ్చిన ఆయనతో మాట్లాడి ఫోటోలకు…
బసవతారం కేన్సర్ ఆస్పత్రి లో ఇవాళ మరో మరో మణిపూస చేరిందని… నటుడు, ఆ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో డిజిటల్ రేడియోగ్రఫీ సదుపాయాన్ని శుక్రవారం బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేడియాలజీ విభాగంలో ఇప్పటికే 3డీ డిజిటల్ మమ్మోగ్రామ్ ఉందని, కొత్తగా డిజిటల్ రేడియోగ్రఫీని కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ఎంతో వేగవంతమైనదని తెలిపారు. సాధారణంగా ఫిల్మ్…
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘క్రాక్’ గ్రాండ్ సక్సెస్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన మలినేని గోపీచంద్… నందమూరి బాలకృష్ణ సినిమా కోసం తానే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను తయారు చేసుకున్నారు. అయితే… ఒకటి రెండు రోజులుగా ఈ సినిమాకు…