వరద గోదారమ్మ పోటెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రానికి ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగితే ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువ ప్రాంతంలో వరదనీటి ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.