సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రేపు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో “గుంతల రహిత రోడ్ల” మిషన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహిత రోడ్లుగా మిషన్ మోడ్లో తీర్చిదిద్దడమే…