Prime Minister Modi will visit Kedarnath: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేదార్ నాథ్ పర్యటనకు ఉత్తరాఖండ్ వేళ్లనున్నారు. రూ.3,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి మోదీ కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించనున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కేదార్ నాథ్ ఆలయంలో ప్రార్థనలు, పూజలు చేయనున్నారు. కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Prime Minister Narendra Modi will visit temples: ప్రతీ దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ సాయుధబలగాలతో గడుపుతుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా దేవాలయాల బాట పడుతున్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 24న దీపావళికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు మోదీ. అక్టోబర్ 21 కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 23న ఛోటీ దీపావళి రోజు ఆయోధ్యలో పర్యటించనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని ప్రముఖ కూడలిలో 14 టన్నుల బరువున్న 40 అడుగుల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమె 93వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ దీనిని ప్రారంభించనున్నారు.
ప్రతీ భారతీయ పౌరుడికి ఈ దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడ హద్దు మీరితే మాత్రం, పరిణామాలు తప్పవు. కొన్ని చోట్ల సంప్రదాయబద్దంగా నడుచుకోవాల్సి ఉంటుంది. కాదు, కూడదు, ఫ్యాషన్, ట్రెండు అంటూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. కచ్ఛితంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. తాజాగా ఓ జంట సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. తామున్న చోటులో హద్దు మీరి ప్రవర్తించడంతో.. జనం బడితపూజ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అయోధ్యలోని సరయు నదిలో ఓ…
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఓ పథకం ఇప్పుడు వివాదాస్పందంగా మారింది. 60 ఏళ్లకు పైబడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్లను ఫ్రీగా అందిస్తుంది. దీనికోసం ఢిల్లీ సర్కార్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే, కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. కాగా, డిసెంబర్ 3…
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణపై దృష్టిసారించిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రచారం చేస్తున్నారు. ఒకే వర్గం ఓటర్లను ఆర్షించడం కాదు.. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు గుప్పిస్తున్నారు.. Read Also: ధాన్యం సేకరణపై పటిష్ట విధానం.. సీఎం ఆదేశాలు గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే…
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఫేక్ మార్కుల షీట్‌తో కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్నందుకు ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి జైలు శిక్ష వేసింది స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు. అంతే కాదు రూ. 8 వేల జరిమానా కూడా విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, ఇంద్ర ప్రతాప్ తివారీ.. డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. రెండో ఏడాది ఫెయిల్ అయినప్పటికీ తప్పుడు…
అయోధ్యలో శ్రీరాముడి అలయం వేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. 2022 చివరి వరకు మొదటిదశ నిర్మాణం పనులు పూర్తి చేసుందుకు ప్రణాళికలు సిద్దం చేసుకొని నిర్మాణం చేపడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, భవ్యరామాలయంలోని రాముడి అభిషేకానికి ప్రపంచంలోని 115 దేశాల నుంచి నీటిని తెప్పిచంచారు ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విజయ్జొల్లి. ఢిల్లీ స్టడీ సర్కిల్ ఎన్జీవో సంస్థతో కలిసి ప్రపంచంలోని…
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సంస్థలు ఎన్నికలకు సంబందించి ముందస్తు సర్వేలు ఫలితాలు విడుదల చేశాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని, మళ్లీ సీఎంగా యోగీని ఎంచుకునే అవకాశం ఉందని ముందస్తు సర్వేలు పేర్కొన్నాయి. ఇక ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో యూపీనుంచి ఎంఐఎం కూడా బరిలోకి దిగుతున్నది. చారిత్రక నగరమైన అయోధ్య నుంచి ఎంఐఎం ఎన్నికల…
యూపీలోని అయోధ్యలో రామాలయం నిర్మాణం వేగంగా జరుగుతున్నది. 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది. అయోధ్యలో ఉన్న మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర ఎయిర్‌పోర్టుకు సమీపంలో కేంద్రం బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను నిర్మించబోతున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఈ ప్రాజెక్టు బాధ్యతలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌కు అప్పగించారు. ఈ సంస్థ అధికారులు ఇటీవలే ఆయోధ్యవెళ్లి అక్కడ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వంతో చర్చలు…