Maharashtra CM Eknath Shinde To Visit Ayodhya Today: మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అయోధ్యలో పర్యటించనున్నారు. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి వెంట వేల సంఖ్యలో శివసైనికులు రానున్నారు.
Jai SriRam : అయోధ్య రాముడి జలాభిషేకానికి పాకిస్థాన్‌లోని రావి నదితో పాటు 155 దేశాల నుంచి నీటిని తెప్పించనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 23న 155 దేశాల నదుల నీటితో రాముడి విగ్రహానికి మహా జలాభిషేకం నిర్వహించనున్నారు.
Ram Mandir: దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు కోటి కళ్లలో రామ మందిరం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2024లో జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ సారి శ్రీరామ నవమి వేడుకలు అయోధ్య రామ మందిరం సిద్ధం అవుతోంది. రామ నవమి వేడుకలు తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆలయ నిర్మాణం పూర్తై, రామ మందిరంలోనే నవమి వేడుకలు జరగనున్నాయి.
Ayodhya Mosque: అయోధ్యలో కొత్త మసీదు నిర్మాణానికి మార్గం సుగమం అయింది. మసీదు నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ(ఏడీఏ) తుది క్లియరెన్స్ ఇచ్చింది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి తీర్పులో సుప్రీంకోర్టు అయోధ్యలో ధన్నీపూర్ మసీదు నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చింది.
Ram - Sita Statue: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అక్కడ ప్రతిష్టించే రాముడి విగ్రహం కోసం నేపాల్‌లోని గండకీ నది నుంచి శాలిగ్రామ శిలలను తీసుకువస్తున్నారు.
Viral Video: అయోధ్య జైలు నుంచి విడుదల అయిన 98 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా వీడ్కోలు చెప్పారు జైలు సిబ్బంది. ఇతరులతో గొడవ పడిన కారణంగా ఐపీసీ 452, 323, 352 సెక్షన్ల కింద 98 ఏళ్ల రామ్ సూరత్ అనే వ్యక్తికి జైలు శిక్ష విధించారు. ఐదేళ్ల పాటు ఆయన జైలులో శిక్ష అనుభవించారు. తాజాగా విడుదల అయ్యారు.
అయోధ్యలో తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న రామాలయం గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, దాని కోసం అత్యుత్తమ శిల్పులను నిమగ్నం చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా "సబ్కా సాత్ సబ్కా వికాస్" ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
PM Narendra Modi to visit Ayodhya on Diwali eve: ప్రధాని నరేంద్ర మోదీ వరసగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించిన ఆయన ఆదివారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. నిర్మాణంలో ఉన్న రామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. ఆ తరువాత అయోధ్యలో జరిగే దీపోత్సవ కార్యక్రమానికి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మోదీ వెంట ఉండనున్నారు. రామాలయ నిర్మాణం గురించి ప్రధాని మోదీకి, యోగి…