ప్రతీ భారతీయ పౌరుడికి ఈ దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కుంది. అలాగని ఎక్కడ పడితే అక్కడ హద్దు మీరితే మాత్రం, పరిణామాలు తప్పవు. కొన్ని చోట్ల సంప్రదాయబద్దంగా నడుచుకోవాల్సి ఉంటుంది. కాదు, కూడదు, ఫ్యాషన్, ట్రెండు అంటూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. కచ్ఛితంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. తాజాగా ఓ జంట సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. తామున్న చోటులో హద్దు మీరి ప్రవర్తించడంతో.. జనం బడితపూజ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
అయోధ్యలోని సరయు నదిలో ఓ జంట స్నానం చేస్తోంది. వీరి చుట్టూ చాలామందే ఉన్నారు. అయితే.. సాధారణంగా స్విమ్మింగ్ పూల్స్, బీచుల్లో జంటలు ముద్దులు పెట్టుకోవడం సర్వసాధారణం కాబట్టి, తామూ అలాగే ముద్దు పెట్టుకుందామని ఆ జంట నిర్ణయించింది. అంతే, చుట్టూ జనం చూస్తుండగానే ముద్దు పెట్టుకున్నారు. దీంతో కోపాద్రిక్తులైన అక్కడి జనాలు, వారిపై దాడికి దిగారు. సంప్రదాయమైన ప్రదేశంలో ముద్దులాడుకుంటారా? అంటూ భర్తను కొట్టారు. తాము చేసింది తప్పేనని, తన భర్తని వదిలిపెట్టమని ఆ వ్యక్తి భార్య ఎంత ప్రాధేయపడినా వదిలిపెట్టలేదు. మరింత కొట్టసాగారు.
నిజానికి.. ఇలా దాడి చేయడానికి బదులు మాటలతో వారికి బుద్ధి చెప్పగలరు. దైవత్యంతో నిండిన ఆ నదిలో ముద్దులు పెట్టుకోవడం తగదని గుణపాఠాలు చెప్పొచ్చు. కానీ, అందుకు భిన్నంగా వాళ్లు దాడికి దిగడం ఈ ఘటన వివాదాస్పదం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దాడి చేయకుండా మాటలతో సర్దిచెప్పి ఉంటే బాగుండేదని కొందరు అంటుంటే, భర్తని కొట్టి సరైన బుద్ధి చెప్పారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022