ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఫేక్ మార్కుల షీట్‌తో కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్నందుకు ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి జైలు శిక్ష వేసింది స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు. అంతే కాదు రూ. 8 వేల జరిమానా కూడా విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. కాగా, ఇంద్ర ప్రతాప్ తివారీ.. డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. రెండో ఏడాది ఫెయిల్ అయినప్పటికీ తప్పుడు మార్కుల షీట్‌తో తర్వాతి ఏడాదికి అడ్మిషన్ తీసుకున్నారని 1992లో ఫిర్యాదు చేశారు అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్.. గ్రాడ్యుయేషన్ సెకండియర్‌లో ఫెయిలైన తివారీ.. 1990లో నకిలీ మార్క్ షీట్ సమర్పించి, పై తరగతిలో చేరినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది.