MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కొట్టేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు రాజసింగ్ తరపు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవని మంగళహాట్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో 295-A ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదుపై ఓవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయాలని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, ఓవైసీ సోదరుల మెప్పు పొందేందుకు పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారన్న రాజాసింగ్ పేర్కొన్నారు. చనిపోయే వరకు రామనామ జపం చేస్తూనే ఉంటానని తెలిపారు. హిందుత్వ సిద్ధాంతం కోసం రాముడి కోసం బుల్లెట్ తూటాలకైనా భయపడనన్న రాజా సింగ్ అన్నారు.
Read also: Punjab Blast Mastermind: 2019 పంజాబ్ పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
రాజాసింగ్ ఈ ఏడాది నవంబర్ 9న చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. రాజాసింగ్‌పై పీడీ యాక్టు నమోదు చేసిన పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 25న అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి కారణమైంది. ఈ వీడియోలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఆగస్టు 22న అతడిని అరెస్టు చేశారు. అయితే కోర్టు రాజాసింగ్‌కు రిమాండ్ విధించలేదు. దీంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అయితే పాత కేసులను దృష్టిలో ఉంచుకుని రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి ఆగస్టు 25న అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఈ నెల 9న విడుదలైంది.
World Bank Revised India GDP Growth: మన దేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.9 శాతానికి పెంపు