NCP Chief Sharad Pawar Said I has not received an invitation of Ram Temple Inauguration: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామ మందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. ఏదేమైనా రామాలయం ఏర్పడైనందుకు చాలా సంతోషిస్తున్నట్లు శరద్ పవార్ తెలిపారు. రామ…
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో.. రామ మందిర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవనుండగా, తర్వాత డెకరేషన్ వర్క్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అలంకరణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
2024 జనవరిలో శ్రీరామ జన్మభూమి అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను కళ్లారా చూడటం కోసం ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే.. అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లను నడపాలని చూస్తోంది. ప్రతి లోక్ సభ నియోజక వర్గం నుండి ఒక ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక రైలులో భక్తులను పంపించాలని బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. అందుకు రాష్ట్ర బీజేపీ…
Ayodhya Ram Temple: భవ్య రామమందిర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పనులు వేగంగా పూర్తవుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రానున్నారు. మోడీతో పాటు దేశంలోని రాజకీయ నాయకులతో పాటు 3000 మంది వీవీఐపీలో సహా 7000 మంది అతిథులను ఆహ్వానించేందుకు శ్రీ రామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ సిద్ధమైంది.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ హాజరుకానున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. 2024 జనవరి 22న శ్రీరాముడితో పాటూ ఇతర దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
UP CM Yogi Adityanath: కార్తీక పౌర్ణమీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ భక్తులకు సందేశం ఇచ్చారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ పవిత్ర స్నానాలు కొనసాగనున్నాయి. దీంతో కార్తీక పౌర్ణమి విశిష్ఠత, ఈ పవిత్ర స్నానాల ప్రాముఖ్యతను వివరిస్తూ యోగి ఆదిత్య నాథ్ కార్యాలయం నుంచి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు కార్తీక…
Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామ మందిర పూజారి పదవికి 3000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 200 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు. మకర సంక్రాంతి తర్వాత 22 జనవరి 2024న ఎంపికైన పూజారులు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
Ayodhya Deepotsav: దీపావళి వేడుకల్లో భాగంగా అయోధ్యలో జరిగిన ‘దీపోత్సవం’ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒకేసారి 22 లక్షల దీపాలను వెలిగించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఆదివారం ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో జరిగిన దీపోత్సవాన్ని ‘అద్భుతమైనది, దైవికమైనది, మరుపురానిది’గా కొనియాడారు. ఈ వేడులకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో దీపోత్సవ్ 2023 ఏడవ ఎడిషన్ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని యూపీ సర్కార్ చూస్తోంది.
Ayodhya: అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని చూస్తున్నారు అధికారులు. ఇప్పటికే మందిర నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. డిసెంబర్ పూర్తి అయ్యే నాటికి మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులను శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఓ శుభవార్త వెలువడింది. అయోధ్య రామమందిరం లోని రాముని దర్శనం 2024 జనవరి నుండి మొదలవుతుంది. భక్తుల కోసం వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ నుండి 24వ తేదీ మధ్యన రాములవారి…