Oyo : గత శనివారం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడంతో అయోధ్య చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేసే సమయం ఆసన్నమైంది. రామ మందిరం గర్భగుడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాన్ని ఎంపిక చేశారు. మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల విగ్రహాన్ని గర్భగుడిలో ఏర్పాటు చేయనున్నారు.
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్‌కెరె ఆంజనేయ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. అంతేకాకుండా.. అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లి “బీజేపీ రాముడిని” ఎందుకు పూజించాలని ప్రశ్నించారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సిద్ధరామయ్యను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించగా ఆంజనేయ మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యే మా రాముడు అని అన్నారు. అలాంటప్పుడు అయోధ్యకు వెళ్లి ఆ రాముని పూజించడం ఎందుకు? అని ప్రశ్నించారు. అయోధ్య రాముడు…
Kishan Reddy: ప్రతి ఇంట్లో జనవరి 22న ఐదు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మన కి బాత్
కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందేభారత్‌కు స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమ్రిత్ ఎక్స్‌ప్రెస్‌గా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే వీటి ప్రారంభోత్సవానికి రంగం అంతా సిద్ధమైంది. రేపు డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను అయోధ్యలో రేపు లాంచనంగా ఈ రైళ్లను ప్రారంభించననున్నారు. ఇందులో ఒకటి యూపీలోని అయోధ్య నుంచి బిహార్‌లోని దర్భంగా వరకు సేవలు ప్రయాణిస్తుండగా.. రెండవది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా-బెంగళూరు…
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం తెలిపాయి.
Shashi Tharoor : అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ముందు దీనిపై రాజకీయాలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీనిపై అధికార బీజేపీ, విపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోస్తున్నాయి.
డిసెంబర్ 30న ప్రారంభించనున్న అయోధ్యలోని విమానాశ్రయానికి 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్'గా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయానికి రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు పెట్టారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ పేరును మార్చేసింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామా కరణం చేసింది.