Ayodhya Ram Temple: భవ్య రామమందిర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పనులు వేగంగా పూర్తవుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రానున్నారు. మోడీతో పాటు దేశంలోని రాజకీయ నాయకులతో పాటు 3000 మంది వీవీఐపీలో సహా 7000 మంది అతిథులను ఆహ్వానించేందుకు శ్రీ రామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ సిద్ధమైంది.
Read Also: Man Posts Own Obituary: తన మరణానికి తానే RIP చెప్పి.. యువకుడి ఆత్మహత్య..
ఇదిలా ఉంటే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శనివారం ఆలయ గర్భగుడి ఫోటోలను పంచుకున్నారు. ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఫోటోలను షేర్ చేశారు. శ్రీరామ్‌లాలా గర్భగుడి దాదాపుగా సిద్ధంగా ఉందని పోస్టులో తెలిపారు. రామ జన్మభూమి ఆలయంలో ప్రతిష్టించేందుకు అయోధ్యలోని మూడు ప్రదేశాల్లో రాముడి విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. ముగ్గురు కళాకారులు మూడు వేర్వేరు రాళ్లతో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాల తయారీ 90 శాతం పూర్తైందని, ఫినిషింగ్ వర్క్ పూర్తి కావడానికి వారం రోజులు పడుతుందని చంపత్ రాయ్ తెలిపారు.
రాముడి ప్రతిష్టా వేడుకల కోసం తరలివచ్చే వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి అధికారులు అయోధ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట సమయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు రామాలయ గర్భగుడిలో పూజలు నిర్వహిస్తారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023