ప్రధాని మోడీ మంగళవారం అయోధ్యలో పర్యటించనున్నారు. రామాలయంలో 22 అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించనున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ఈ జెండా ఆవిష్కరణ జరగనుంది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: టీడీపీకి అత్యంత సమస్యాత్మకంగా ఆ నియోజకవర్గం..!
2020 ఆగస్టులో రామమందిరానికి ప్రధాని మోడీ శంకుస్థాపం చేశారు. ఇక 2024 జనవరి 22న రామమందిరం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఆలయ జెండాను మోడీ ఆవిష్కరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: విజయసాయి రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ కోసం తహతహలాడుతున్నారా..?
ఈ కార్యక్రమాన్ని ‘‘ధ్వజ్ ఆరోహణ్’’గా పిలుస్తారు. లంబకోణ త్రిభుజాకార కాషాయ జెండా సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ఇది శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి. ‘ఓం’ చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ ‘శిఖర్’ పైన ఉంచనున్నారు. ఈ కార్యక్రమం రాముడు-సీత వివాహ పంచమి ముహూర్తంతో సమానంగా జరుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రముఖ కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి మార్గదర్శకత్వంలో అయోధ్య, కాశీ-దక్షిణ భారతదేశం నుంచి 108 మంది ఆచార్యులు ఈ ఆచారాలను నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 2.30 గంటల వరకు క్యూఆర్-కోడ్ పాస్‌లు ఉన్న ఆహ్వానిత అతిథులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. దాదాపు 6,000 మంది అతిథులను ట్రస్ట్ ఆహ్వానించింది.