Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలో జరిగిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చిందని, ఇందుకు అయోధ్ నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయోధ్య దీపోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్‌లో రెండు రికార్డులు నమోదయ్యాయి. 1121 మంది అర్చకులు కలిసి సరయు మహా హారతి చేశారు. దీంతో 25 లక్షల 12 వేల 585 దీపాలు వెలిగించారు. రాంలాలా సన్నిధిలో జరిగే తొలి దీపోత్సవంలో ఈసారి యోగి ప్రభుత్వం అద్వితీయమైన చొరవ తీసుకుంది.
అక్షయ్ కుమార్ గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని అందరికీ తెలుసు. అతను ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేస్తుంటాడు. తాజాగా నటుడు మరోసారి కొన్ని గొప్ప మనసు చాటుకున్నాడు. అయోధ్యలో ప్రతిరోజూ కోతులకు ఆహారం ఇవ్వాలని అక్షయ్ నిర్ణయించుకున్నాడు. కోటి రూపాయల విరాళం ప్రకటించాడు.
Ayodhya Diwali: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాంలాలా ఆలయంలో ఈసారి ప్రత్యేక దీపాలను వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి గ్రాండ్ గా “పర్యావరణ స్పృహ”తో సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబరు 30న సరయూ ఘాట్‌ల వద్ద జరిగే మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30…
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు.
Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఓ ఉదంతం వెలుగు చూసింది. నాకా ప్రాంతంలో ఉన్న అమృత్ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు కంపెనీలోకి ప్రవేశించే సమయంలో కార్మికుల చేతుల్లోంచి కాలవ (మతపరమైన చేతి దారం) ను కోసేసారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విషయం తెలియగానే హిందువులు దీనిపై నిరసనకు దిగారు. అయితే., ఫ్యాక్టరీ భద్రతా అధికారి ఒక ప్రకటన…
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈరోజు ఓ విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది దీనిని ప్రకృతి విపత్తుగా భావిస్తే.. మరి కొందరు అద్భుతంగా భావిస్తున్నారు.
గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుపతి దేవస్థానం లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించేవారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ వాదన తర్వాత పెద్ద రాజకీయ వివాదం తలెత్తింది. తిరుపతి లడ్డూ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివేదిక కోరారు. తిరుపతి దేవస్థానం లడ్డూల స్వచ్ఛతపై వివాదం నడుస్తుండగా.. యూపీ నుంచి శుభవార్త వచ్చింది. జీఐ ట్యాగ్ రేసులో అయోధ్యలోని మూడు స్వీట్లు… జీఐ ట్యాగ్ రేసులో అయోధ్యలోని ఖుర్చన్…
Gang Rape: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కాంట్ పోలీస్ స్టేషన్‌పై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం మేరకు.. మహిళ తనకు తెలిసిన యువకుడిని కలిసేందుకు వెళ్లినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ…
Ayodhya : అయోధ్యలో భూమి రేటు పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్య ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో అక్కడ సరైన నష్టపరిహారం అందకపోవడం కూడా ఓ కారణమని పేర్కొంది.