Israel-Iran War: ఇజ్రాయిల్-హిజ్బుల్లా-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చింది. నస్రల్లానే కాకుండా హిజ్బుల్లా ప్రధాన కమాండర్లు అందరిని చంపేసింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
India On Iran: భారతీయ ముస్లింలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Iran: అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి క్రూరంగా ఊచకోత కోసింది. పిల్లలు, మహిళలనే తేడా లేకుండా చంపేసింది. ఈ దాడుల్లో 1400 మంది మరణించారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలను బందీలుగా చేసుకున్న హమాస్ తీవ్రవాదులు వారిని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో వేల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల 8 వేల మంది వరకు…
Israel-Hamas: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి భీకర యుద్ధానికి దారి తీసింది. శనివారం తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లతో దాడి జరిపారు. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ని ఏమార్చి సరిహద్దులు దాటి ఇజ్రాయిల్ పౌరులను చంపారు. పలువురిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు.