ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత 24 గంటల నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతోంది. ఇక శనివారం జరిపిన దాడుల్లో.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగాయి.
Iran: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమేనీ వారసుడిగా తన రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఎంపిక చేసినట్లు టాక్.
Iran-Israel : ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడులకు ప్రతి దాడి చేస్తామని టెహ్రాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.
Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఖమేనీ రెండవ పెద్ద కుమారుడు, మోజ్తాబా ఖమేనీ (55) అతని తర్వాత సుప్రీంలీడర్‌గా ఎన్నికలయ్యే అవకాశం కనిపిస్తోంది.
Drone Targets Israel PM: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా లెబనాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్ ఈరోజు (శనివారం) దక్షిణ హైఫాలోని సిజేరియాలోని నెతన్యాహు ప్రైవేట్ నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ చంపేసిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
Iran Supreme Leader: హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో సిన్వార్ మృతి బాధ కలిగిస్తోంది.. అయినప్పటికీ అతడు అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదన్నారు.
Iran: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం, ఇజ్రాయిల్‌పై ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడుల తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఉపన్యసించారు.
Israel-Iran War: ఇజ్రాయిల్-హిజ్బుల్లా-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చింది. నస్రల్లానే కాకుండా హిజ్బుల్లా ప్రధాన కమాండర్లు అందరిని చంపేసింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
India On Iran: భారతీయ ముస్లింలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Iran: అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి క్రూరంగా ఊచకోత కోసింది. పిల్లలు, మహిళలనే తేడా లేకుండా చంపేసింది. ఈ దాడుల్లో 1400 మంది మరణించారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలను బందీలుగా చేసుకున్న హమాస్ తీవ్రవాదులు వారిని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో వేల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల 8 వేల మంది వరకు…