Iran: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమేనీ వారసుడిగా తన రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఎంపిక చేసినట్లు టాక్. అయితే, ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలని అక్కడి అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియాల్లో వచ్చిన కథనాల ప్రకారం.. 60 మంది అసెంబ్లీ సభ్యులతో సెప్టంబరు 26వ తేదీన ఖమేనీ భేటీ నిర్వహించారు. ఈ సమయంలో మోజ్తాబాను తన వారసుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆయన నిర్ణయంపై మొదట వ్యతిరేకత వచ్చినప్పటికి ఆ తర్వాత ఏకగ్రీవంగా అంగీకరించినట్లు సమాచారం.
Read Also: Maharashtra: బీజేపీ మాజీ మహిళా ఎంపీపై దాడి.. కుర్చీలు విసురుతూ.. దుర్భాషలాడుతూ(వీడియో)
మరోవైపు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని, లీక్‌లకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అసెంబ్లీ సభ్యులను ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించిన్నట్లు సమాచారం. ఆ దేశంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుంది. ఈ కారణంగానే మోజ్తాబా ఖమేనీ నియామకాన్ని సీక్రెట్ గా ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, 1989లో రుహోల్లా ఖొమేనీ మరణించిన తర్వాత ఆ దేశ సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 85 ఏళ్లు నిండాయి. వాస్తవానికి ఆయన వారసుడిగా భావించిన ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయన అధికారిక గృహంలోనే వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు.
Iran International is out with a report which claims that Iran's regime's Assembly of Experts has secretly chosen Mojtaba Khamenei as his father's successor as supreme leader. It allegedly happened at an "exceptionally unusual meeting" on September 26. Hard to verify, but I pic.twitter.com/km9Jrng2OI
— Nikki ✝️🇮🇱🇺🇲 (@Nikki87679054) November 17, 2024