IndiGo: గతేడాది డిసెంబర్ నెలలో ఇండిగో విమానాల రద్దు సంక్షోభం తలెత్తింది. అయితే, దీనికి చర్యగా కేంద్రం ఇండిగోకు భారీ షాక్ ఇచ్చింది. రూ. 22 కోట్ల జరిమానా విధించింది. గతేడాది తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు దేశవ్యాప్తగా ఇండిగో విమానాల రద్దు కొనసాగింది. 2507 విమానాలు రద్దు కావడంతో పాటు 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్‌పోర్టుల్లో 3 లక్షల మంది ప్రయాణికులు నిలిచిపోయారు. దీనిపై డీజీసీఏ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ తర్వాత, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇండిగోపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.
Read Also: 2026లో రాబోతున్న 5 కొత్త 7-సీటర్ SUVలు ఇవే..
ఆ సమయంలో విమాన కార్యకలపాలను, సంక్షోభ నిర్వహణపై తగినంత పర్యవేక్షల లేకపోవడంపై ఇండిగో సీఈఓకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సవరించిన FDTL నిబంధనల ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలమైనందుకు ఇండిగోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ రూ. 22.20 కోట్ల జరిమానాతో పాటు నియంత్రణ ఆదేశాలు, దీర్ఘకాలిక వ్యవస్థాగత దిద్దుబాటుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఇండిగో రూ. 50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందించాలని కేంద్రం ఆదేశించింది. ఆరు వేర్వేరు నిబంధనల కింద ఉల్లంఘనలకు విమానయాన సంస్థ రూ. 1.8 కోట్ల ఒకేసారి జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించబడింది, ప్రతి ఉల్లంఘనకు రూ. 30 లక్షల జరిమానా విధించబడుతుంది.