బెంగళూరులో హైడ్రా బృందం పర్యటిస్తుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు CSR కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది.
ఆన్‌లైన్‌లో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల సేవలు నిలిపివేత భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్‌లో అనుమతులు జారీ చేసే పోర్టల్‌లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా పలు రోజుల పాటు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రకటనలో తెలిపారు. సర్వర్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్‌లో భాగంగా వచ్చే నెల నాలుగో తేదీ వరకూ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. ప్రస్తుతం భవనాల నిర్మాణాలు, లేఅవుట్లకు…
చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పలువురు పరిశోధకులు, నిపుణలతో హైడ్రా సమావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశమైంది.
లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వీడియో సమావేశం నిర్వహించారు. నేరుగా హైడ్రా కార్యాలయం నుంచి బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును కమిషనర్ పరిశీలించారు. మురుగుతో నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచినీటి చెరువులుగా తీర్చి దిద్దారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆనంద్ వివరించారు.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్‌మెంట్)పై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష చేశారు. బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బెంగళూరుతో పాటు.. దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమన్వయంతో మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై కసరత్తు…
గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన నగరంలో అస్సలు ఎన్ని చెరువులుండేవి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కతేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం తన అధికారుల బృందంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెళ్లారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్‌తో పాటు ఇతర అధికారులతో హైడ్రా ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వే ఆఫ్…
పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని హైడ్రా అధికారులు వెల్లడించారు. ప్రజలు గమనించాలి.. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని తెలిపారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు, సామాజిక…
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఆందోళనలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతంలో నివాసితుల భద్రత, పునరావాసం, కూల్చివేతలకు సంబంధించిన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, కమిషనర్ కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వేలు హైడ్రాకు సంబంధించినవి కాదని స్పష్టంగా అవగాహన చేయాలని కోరారు. ఈ సర్వేలు హైడ్రా చట్టం లేదా ప్రాజెక్టుకు సంబంధించినవి కాదని తెలిపారు. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో…
హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా పేర్కొంది. ఇప్పటికే నిర్మించి నివాసం ఉండే ఇళ్లను కూల్చమని హైడ్రా వెల్లడించింది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అయితే.. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు , లేఅవుట్లు హైడ్రా తొలగించింది. హైదరాబాద్ ట్రైసిటీలోని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో…