జీవితంలో తమ బిడ్డలను ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు తల్లిదండ్రులు తమ జీవితాన్నే ధారపోస్తుంటారు. అన్ని విషయాల్లో బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతుంటారు. వాళ్ల జీవితంలో సాధించలేకపోయింది పిల్లలు సాధిస్తుంటే దానిని చూసి మురిసిపోతుంటారు. అందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఓ ఉబర్ ఆటో డ్రైవర్ కూడా అలాగే కష్టపడుతున్నాడు.
విశాఖ పర్యటనలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ మేరకు 2022-23 సంవత్సరానికి రాష్ట్రంలో సొంత ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో భాగంగా నాలుగో విడతగా దాదాపు 2,61,516 మంది లబ్ధిదారులకు రూ.10వేలు చొప్పున రూ.261.51 కోట్ల ఆర్ధిక సహాయం అందించింది. దీంతో గత నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను…
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి ఆటో దగ్ధమైన ఘటనలు ఐదుగురు సజీవదహనం కావాడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మహిళా కూలీల సజీవ దహనం హృదయ విదాకరమన్న ఆయన.. కూలీల సజీవ దహనం ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఆ వాహనంపై విద్యుత్ తీగలుపడి ఈ ఘోరం చోటు చేసుకొందని తెలిసిందని.. రెక్కల కష్టం మీద బతికే…
ఆటోకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఎనిమిది మంది సజీవ దహనం అయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
నిన్నఅర్ధరాత్రి (18-మే-2022) నుంచి హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు సేవలు నిలిచిపోనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లను నిలువుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వం న్యూమోటర్ వెహికల్ చట్టం 2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు వాహనాల బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు. అంతే కాదు ఫిట్‌నెస్, లేట్ ఫీజు…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్‌నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో, క్యాబ్, లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కౌంటర్ సిగ్నేచర్ పర్నిట్ ( సింగిల్ పర్మిట్ ) దేశంలోని ప్రతి రాష్ట్రం పొరుగు రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా…
పెట్రో ధరల పెరుగుదల వెనుక ఎలాంటి కారణాలు ఉన్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఆ ధరల జోలికి పోలేదు.. ఇక, ఫలితాలు వెలువడిన తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా వడ్డించింది.. దీంతో.. పెట్రోల్ ధరలు ఆల్‌టైం హై రికార్డును సృష్టించాయి. దీంతో, ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇవాళ, రేపు బంద్ పాటిస్తున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఈ రెండు…
మహిళలపై వరుసగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. రోజూ ఏదో ఒక చోటు ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఇక, తమిళనాడులో ఓ వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది.. తనతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి బెదిరించిన ఆటో డ్రైవర్లు.. ఆ తర్వాత యువ డాక్టర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన సంచలనంగా మారింది.. వేలూరు సత్‌వచ్చారిలో జరిగిన ఈ ఘటన విస్మయానికి గురిచేస్తోంది. Read Also: COVID 19: ఆ వేరియంట్‌తో మళ్లీ ముప్పు..…