ఈమధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామ సమీపంలో వంతెనపై ప్రమాదం జరిగింది. తుంగభద్ర ఎగువ కాలువ 115/167 కిలోమీటర్ వద్ద నిర్మించిన వంతెనపై బులేరో లగేజీ ఆటో వస్తుండగా అకస్మాత్తుగా వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో సావిత్రి (30) అనే మహిళ కూలి కాలువలో గల్లంతయింది. మిగతా 29 మంది కూలీలను సురక్షితంగా రక్షించారు స్థానికులు. గల్లంతయిన మహిళా కూలీ కోసం గాలిస్తున్నారు.
శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గమనం’. సంజనా రావు దర్శకత్వంలో రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర కథానాయకుడు శివ కందుకూరి, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూడగా, నటి శ్రియా శరన్ కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ లో చూసింది. విశేషం ఏమంటే……
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కంపెనీ నుంచి ఇటీవలే ఎలక్ట్రిక్ ట్రియో ఆటోలు విడుదలయ్యాయి. ఈ ట్రియో ఆటోపై జోహో సీఈవో శ్రీథర్ ట్వీట్ చేశారు. మహీంద్రా ట్రియో ఆటో బాగుందని, ఒకసారి రీఛార్జ్ చేస్తే 125 కిమీ వరకు వెళ్లవచ్చని ట్వీట్ చేశారు. పల్లెటూరి రోడ్లకు అనుగుణంగా డిజైన్ ఉందని, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లేందుకు, డిజైన్‌లో చిన్నచిన్న మార్పులు, ఆకట్టుకునే విధమైన రంగుల్లో ఆటోను డిజైన్ చేయాలని జోహో సీఈవో సూచించారు. చిన్న చిన్న…
హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి దారుణం చేసుకుంది. కొంతమంది రౌడీమూకలు ఓ యువకుడిని చితకబాది గొంతుపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించారు. వివరాల్లోకి వెళ్తే… సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడు తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో మెడిసిన్స్ కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రోలో వచ్చి మెహిదీపట్నం వరకు బస్సులో వచ్చాడు. అప్పటికే రాత్రి 10:30 గంటలు దాటడంతో మెహిదీపట్నం…
ముంబైలోని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వెలుపల భారీ పోలీసులను మోహరించారు. ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలి యాకు ముప్పు ఉందని ఒక టాక్సీ డ్రైవర్ సూచించడంతో భద్రతను పెంచారు. తాజాగా పోలీసులు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు. ఏం జరిగింది?టాక్సీ డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఒక క్యాబ్‌లో కొంతమంది అనుమా నాస్పద వ్యక్తులు సోమవారం యాంటిలియా అడ్రస్‌ను అడిగారు. అతను వారిని ఆన్‌లైన్‌లో వెతకమని సూచించాడు. అయితే క్యాబ్ డ్రైవర్ అడ్రస్ అడిగిన తీరులో ఏదో…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ ధరలు ఇప్పటికే వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. పెట్రోల్ ధరలు పెరగడంతో దానికి బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కాగా, ఇప్పుడు ఆటో ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఆటో చార్జీలు పెంచేందుకు బెంగళూరు ఆర్టీఏ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు మొదటి 1.9 కిలోమీటర్‌కు రూ.25,…
అసలే కరోనా సమయం.. బతకడమే కష్టంగా మారింది.. ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయాయి.. ఉపాధిపై కరోనా ఘోరంగా దెబ్బకొట్టింది. ఈ సమయంలో.. ఈఎంఐలు కట్టడం కష్టంగా మారిన పరిస్థితి.. కానీ, ఓ ఆటో డ్రైవర్‌కు ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఎక్కువయ్యాయి.. మరోవైపు పోలీసుల వేధింపులు పెరిగాయని.. పెట్రో ధర భారం కూడా పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్.. తాను ఫైనాన్స్‌లో తీసుకున్న ఆటోపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.. ఈ ఘటన హన్మకొండలోని కాళోజీ జంక్షన్ లో…
పాకిస్థాన్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు.. వైద్యం కోసమో, ఇతర అవసరాల నిమిత్తమో ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలను వెంటిపడి వేధిస్తున్నారు.. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్‌పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఆటో ఎక్కి… ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు ఆకతాయిలు. దీంతో ఆటోలోని రెండో మహిళ తన కాలి చెప్పును…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జి.హెచ్.యం.సి పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో బాగంగా 2 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ ను అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. High exposure గ్రూపులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం క్యాబ్, ఆటో, వ్యాక్సినేషన్ సెంటర్ ను తనిఖీచేశారు.…